కావలసిన పదార్థాలు : కండెన్స్ డ్ మిల్క్ : 400 గ్రా పాలు : 3 కప్పులు పెసరపప్పు : కప్పు నెయ్యి : కప్పు యాలకులపొడి : అరటీస్పూను బాదం పప్పు : 3 టేబుల్ స్పూన్లు ఎండుద్రాక్ష : 3 టేబుల్ స్పూన్లు జాజికాయపొడి : అరటీస్పూను తయారు చేసే విధానం : పెసరపప్పుని కడిగి అరగంట నుంచి గంట సేపు నానబెట్టాలి. తరవాత మెత్తగా రుబ్బాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక పెసరపప్పు ముద్ద వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. మిశ్రమం బంగారు వర్ణంలోకి మారిన తరవాత పాలు పోసి తిప్పుతూ ఉడికించాలి . పాలన్నీ ఇగిరిపోయాక కండెన్స్ డ్ మిల్క్ వేసి గట్టిపడి హల్వాలా అయ్యేవరకూ తిప్పుతూ ఉడికించాలి. చివరలో బాదంపప్పు ముక్కలు, ఎండుద్రాక్ష, యాలకులపొడి వేసి కలపాలి . తరవాత నెయ్యి రాసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి సమయం సర్ది ఆరాక ముక్కలుగా కోయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: