శనగలు వీటిని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పొట్టు తీయని శనగలను గుగ్గిళ్ల చేసుకొని చాలా మంది తింటూ ఉంటారు. కొందరైతే వేపుకొని ఉప్పు, కారం, ఉల్లిపాయ కలిపి చల్లుకొని మరీ తింటారు. ఇంకొందరు వీటిలతో కూరలు కూడా చేస్తారు. అయితే పొట్టు తీయని శనగలను మనం అప్పుడప్పుడు తినేకంటే రోజు తింటేనే ఎక్కువగా ప్రయోజనం పొందవచ్చు. అయితే శనగలని ఎప్పుడు ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు.
ఈ రోజు మనం శనగల్ని ఎలా తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.శెనగలను తినటానికి కూడా మనకి కొన్ని నియమాలంటూ ఉంటాయి. మీరు ప్రతి రోజూ ఒక గుప్పెడు శనగల్ని అంటే ఒక చిన్న కప్పు శెనగలని తీసుకుంటే చాలు, అది కూడా మీరు శెనగల్నీ ఎలా తీసుకోవాలంటే చిన్న కప్పు శెనగలు తీసుకొని ఇవి మునిగిపోయేంత వరకు నీటిని పోయాలి. ఇలా ఈ శెనగల్ని మనం రాత్రి అంతా నానపెట్టాలి. ఎందుకంటే నానబెట్టిన శనగల్లో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇది కనుక మనం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకుంటే జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శెనగల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.దీంతో గుండె జబ్బులు కూడా రావు. అధిక బరువు ఉన్నవారు కూడా ఇలా కనుక మీరు శెనగల్ని ఉదయాన్నే తింటే బరువు కూడా తగ్గొచ్చు.
డైటింగ్ చేసే వాళ్లు కనుక వీటిని తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. మాంసాహారం తినని వెజిటేరియన్స్ కు శనగలు ఒక వరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ లో అంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ కన్నా శెనగల్లో పది రెట్లు ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. దీంతో శరీరానికి చాలా మంచి పోషణ లభిస్తుంది. అలాగే శెనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలల్లో ఉండే కాల్షియానికి దాదాపు సమానమైన కాల్షియం శెనగల్లో ఉంటుంది.
కాబట్టి పిల్లలకు కనుక మనం శనగల్ని పెడుతూ ఉంటే ఎముకలు దృఢంగా మారి ఎముకల పుష్టి కూడా కలుగుతుంది. ఇవి బిపిని కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా శెనగల్ని కనుక రక్తం తక్కువగా ఉన్నవారు తీసుకుంటే రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగి రక్తహీనత ఉన్నవారికి కూడా బాగా మేలు చేస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. అయితే చాలా మంది పిల్లలు కానీ, పెద్దలు కానీ ఇలా పచ్చి శనగలును నానబెట్టి తింటం కూడా మీకు కష్టంగా అనిపిస్తే ఒక కప్పు శెనగల్ని ఇలా ఉడకబెట్టుకొని రోజూ తింటే రక్తం కూడా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు కూడా తయారవుతాయి.
మీ పిల్లలకి స్నాక్స్ గా వీటిని ఎక్కువగా పెడుతూ ఉండండి. వాళ్ళల్లో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీటి మూలంగా ఒత్తిడీ ఆందోళన దూరమవుతాయి. మంచి మూడ్ లోకి వస్తారు. డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది.నిద్ర అనేది బాగా పడుతుంది. నిద్రలేని సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినడం మొదలు పెట్టండి. ముఖ్యంగా వీటిలో ఐరన్ ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి బాగా శక్తి అంది రోజంతా శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గవు. అందువల్ల మనం ఉత్సాహంగా ఉంటాము.
ముఖ్యంగ శనగల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉండటం మూలంగా మన శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపించేస్తుంది. దీని మూలంగా కిడ్నీలపై భారం అనేది తగ్గి కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కిడ్నీ సమస్యలతో ఉండేవాళ్లు కూడా శెనగలు తినటం ఒక మంచి ఆప్షన్. అలాగే పచ్చకామెర్లు, లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా శెనగలను తింటే ఆ వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవచ్చు. చివరిగా దంపతుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య సంతానలేమి.ముఖ్యంగా చాలా మంది దంపతులు ఎదుర్కొనే సమస్య ఇది.
మీలో వీర్యకణాలు తక్కువగా ఉండటం మూలంగా సంతాన లేమి అనేది కలుగుతుంది. ముఖ్యంగా అలాంటి సమస్యతో బాధపడేవారు, గుప్పెడు శెనగలను ఇలా ఉడకపెట్టి వాటిని స్వచ్ఛమైన నేతిలో వేయించి ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకోండి. తరువాత గోరువెచ్చని పాలు తాగండి. ఇలా చేయటం వలన మీ శరీరం దృఢంగా అవటమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది. చివరిగా మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా శెనగల్ని నానబెట్టిన తరువాత ఈ నానపెట్టి నీటిని కూడా మీరు తాగండి. ఇలా తాగడం వల్ల కూడా మీకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలనేవి కలుగుతాయి.