ఈస్ట‌ర్ అంటే క్రైస్త‌వులు చేసుకునే పండుగ‌. గుడ్‌ఫ్రైడే రోజు ఏసుప్ర‌భువుకు శిలువ‌ను వేసి స‌మాధిలో ఉంచిన‌ రోజు గుడ్ ఫ్రైడేని చేస్తే.. మూడ‌వ‌రోజు ఆయన స‌మాధి నుంచి లేచిన రోజు ఈస్ట‌ర్ పండుగ‌ను చేస్తారు. వాళ్ళు రంగులు జ‌ల్లుకుని ఎంతో ఆనందంగా మిఠాలులు వండుకుని చికెన్‌, కేక్‌లు ఇలా ర‌క ర‌కాల వంట‌లు చేసుకుని ఎంతో ఆనందంగా జ‌రుపుకుంటారు. ఆయ‌న మానవుల పాప పరిహారార్థం శిలువపై మరణించి తిరిగి లేచిన ఏసు ప్రభువు ఆగమనాన్ని సూచించే పండుగ ఈస్టర్. ఈ వేడుకను పురస్కరించుకొని కేకులు పంచుకోవటం అనేది వారి సంప్రదాయం. ఈస్టర్ వేడుకల్లో భాగంగా డేట్స్ కేక్ రుచిని మ‌న హెరాల్డ్ స్పెష‌ల్ వంట‌కంలో తెలుసుకుందాం...

 

కావలసిన ప‌దార్ధములు: మైదాపిండి - 1 కప్పు, తాజా ఖర్జూరాలు - అరకప్పు, చక్కెర - ముప్పావు కప్పు (కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు), పాలు - ముప్పావు కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ పౌడర్ - 1 చెంచా, దాల్చినచెక్క పొడి - అరచెంచా, లవంగాల పొడి - అరచెంచా, ఎండబెట్టి దంచిన అల్లం పొడి - చిటికెడు, తరిగిన జీడిపప్పు - 4 చెంచాలు 

 

తయారుచేయు విధానం: ముందుగా ఖర్జూరాల్లోని గింజలు తీసేసి ముక్కలు చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి తిప్పి మరింత మెత్తగా అయ్యాక తీసి పక్కన బెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, పాలు, చక్కెర, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, అల్లం పొడి వేసుకుని బాగా కలుపుకొని, అందులో ముందు సిద్ధం చేసుకొన్న ఖర్జూరం మిశ్రమాన్ని, తరిగిన జీడిపప్పు వేసి మరోమారు బాగా కలపాలి. చివరగా తగినంత నూనె  లేదా నెయ్యి వేసి బాగా కలిపాలి. తర్వాత కేక్ గిన్నె లోపలి భాగానికి కొద్దిగా వెన్న లేదా నూనె రాసి తయారైన మిశ్రమాన్ని అందులో పోసి ఓవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఉంచాలి. ఒవేన్ లేనివారు కేక్ గిన్నెలో పోసి స్టౌమీద పెట్టి కూడా చేసుకోవచ్చు. అయితే స్టౌ మీద చేసేవారు గిన్నెలో మిశ్రమం మీద కాస్త వెన్నను వేస్తే కేక్ పై భాగం మెత్తగా వస్తుంది. తయారైన కేకును ఖర్జూరపు ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తో అలంకరించుకోవాలి. అంతే ఈస్ట‌ర్ డ్రై ఫ్రూట్ కేక్ రెఢీ. ఇక దాన్ని చిన్న చిన్న స్లైసెస్‌గా క‌ట్ చేసుకుని తింటే సూప‌ర్బ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: