అందుకే ఒత్తయిన నల్లని జుట్టు మీ సొంతం కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.తలస్నానానికి ముందు కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి శిరోజాలకు పట్టించాలి. దీనివల్ల జుట్టుకి చక్కని మెరుపు, నునుపు వస్తుంది.తలస్నానం వీలైనంత వేగంగానే ముగించి శిరోజాలను ఆరబెట్టుకోండి. గంటల తరబడి జుత్తును తడిగానే ఉంచేయడం మంచిది కాదు.జుట్టుకి రంగులు వేసే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. ఎందుకంటే రంగులలోని రసాయనాల వలన జుట్టు ఊడిపోతుంది.
వాడే దువ్వెన విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. పళ్ళు దగ్గరగా ఉండి మొనదేలిన దువ్వెనలను ఉపయోగించకూడదు. దీని వల్ల జుట్టు చివర్ల చిట్లిపోతుంది. పళ్ళు దూరంగా ఉండే దువ్వెనలను మాత్రమే వాడాలి.బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి.కొంచెం మజ్జిగ, బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది.పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి