
అంతేకాదు ఇలాంటి శిశువుల్లో క్యాన్సర్ కారకాలు చేరే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ ఎ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకునే గర్భిణిలకు పుట్టే శిశువులకు పుట్టుకతోనే శారీరకలోపాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్ ను పరిమితికి మించి తీసుకుంటే చిన్నారుల్లో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇక విటమిన్లు బి1, బి2, బి6, బి12 అనే ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటినీ మల్టీవిటమిన్ గా చాలావరకు తీసుకుంటారు. అయితే ఆహారంగా తేలికగా లభించే బి కాంప్లెక్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన దాంట్లో కేవలం యాభై శాతం మాత్రమే సప్లిమెంట్స్ గా మిగతా యాభై శాతం ఆహారం ద్వారా తీసుకుంటే మంచిది. అయితే గర్భిణులు బీ కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఎంత మేరకు వాడాలి అన్నది డాక్టర్ సూచన ప్రకారమే వేసుకోవాలి.
అయితే విటమిన్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. పరిమితి మించితే పాపాయి ఆరోగ్యానికి ముప్పు తేస్తాయి. డాక్టర్ సలహా లేనిదే ఏ మాత్రలు వాడవద్దు. పొగతాగే అలవాటు, మద్యం సేవించే అలవాటు ఉండే వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలనుకునే మహిళలు దురలవాట్లకు దూరంగా ఉండాలి.
కాగా, నెల తప్పగానే చాలామంది మహిళలు బెడ్ రెస్ట్ అంటూ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. ఇది సరి కాదు. కాబోయే అమ్మల శారీరక వ్యాయామం, మానసిక ఆనందం కడుపులోని బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికపాటి పనులు చేయడం, మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాజిటివ్ గా ఆలోచించడం వల్ల పాపాయి ఆరోగ్యంగా పెరుగుతుంది.