హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘గ్రీన్ ఛాలెంజ్’ కార్యక్రమాలను ప్రోత్సహించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ పిలుపు అందుకొని.. బుధవారం ఆమె బేగంపేటలోని మయూరి బిల్డింగ్‌లో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆ ఛాలెంజ్‌ను మరో ముగ్గురి  సెలబ్రిటీలకు విసిరారు. భావి తరాలు సుఖంగా ఉండాలన్నా.., గ్లోబల్ వార్మింగ్ పోవాలన్నా.., ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని యాంకర్ సుమ పిలుపునిచ్చారు. 


హీరో జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్‌కు యాంకర్ సుమ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. వారు కూడా మొక్కలు నాటుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కష్టాలున్నా.., సుఖాలున్నా.. మనకు మంచి వాతావరణం ఉంటేనే ఆనందంగా ఉంటామని ఈ సందర్భంగా సుమ పేర్కొన్నారు.


‘మొక్కలంటే నాకు చాలా ఇష్టం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు ఊపిరి, శ్వాస అవే. శ్వాసకు మూలమైన ఆక్సిజన్‌ను ఇచ్చే చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. గ్రీన్ ఛాలెంజ్ కారణంగా చాలా కాలం తర్వాత గార్డెనింగ్ చేసే అదృష్టం దక్కింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటే ఛాలెంజ్‌ను సెలబ్రిటీలు ఇలాగే కంటిన్యూ చేయాలి’ అని సుమ అన్నారు.


‘మొక్కలు నాటుదాం - ప్రకృతిని అందంగా ఉంచుదాం - మనందరం ఆనందంగా ఉందాం’ అని సుమ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమ రూపంలో సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, యాంకర్ అనసూయ మొక్కలు నాటిన అనంతరం యాంకర్ సుమకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన సుమ మొక్కలు నాటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: