ఇక వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. బయటకి వెళ్లాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. అందుకే బయటకి వెళ్ళేటప్పుడు కారు తీసుకెళ్లడం చాలా మంచిది. కాని ఆ కారు వల్ల లోపల మనిషి సురక్షితంగా ఉంటాడు. కాని కారు మాత్రం వానకి సురక్షితంగా వుండలేదు. అందుకే వానా కాలం నుంచి కారుని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.


*వాటర్ ప్రూఫ్ బాడీ కవర్:*

ఇక మన కారుని ఏకాలంలోనైనా కాని బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి నుండి కాపాడుకోవడానికి వాటర్‌ప్రూఫ్ పాలిమర్ కార్ కవర్‌లను ఉపయోగించాలి. ఇవి వర్షపు నీటిని అడ్డుకొని, కారులోనికి నీరు రాకుండా చేస్తాయి. అందువల్ల కార్ పాడవ్వకుండా ఉంటుంది.కాబట్టి తప్పనిసరిగా వాటర్ ప్రూఫ్ బాడీ కవర్ ని వాడండి.


*మడ్ ఫ్లాప్స్:*

ప్రతి కారుకు మడ్ ఫ్లాప్‌లు అనేవి చాలా అవసరం. కేవలం వానాకాలంలోనే కాదు, ప్రతి సీజన్‌లో కూడా ఇవి వాడటం చాలా మంచిది. సాధారణంగా కంపెనీ నుండి వచ్చే కారుకు మడ్ ఫ్లాప్స్ ఉండవు. వీటిని యాడ్-ఆన్ యాక్ససరీస్‌గా కొనాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కారుకి మడ్ ఫ్లాప్స్ లేకపోయినా లేదా అవి పాడైపోయినా వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని అమర్చుకోవాలి.ఇక వానాకాలంలో మడ్ ఫ్లాప్స్ రోడ్డుపై ఉండే నీటిని, బురదను వెదజల్లకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి.


*రెయిన్ షూ కవర్స్:*

అలాగే రెయిన్ షూ కవర్స్ వానాకాలంలో మీ షూ పాడవకుండా కాపాడటమే కాకుండా, బయట ఉండే బురద మీ కారులోకి రాకుండా ఉంచడంలో కూడా ఉపయోగపడతాయి.ఇక ఈ షూ కవర్లు అనేవి సాగే గుణం కలిగిన సిలికాన్ రబ్బరుతో తయారు చేయబడి ఉంటాయి.అందువల్ల ఇవి ఎవ్వరికైనా చాలా ఈజీగా సరిపోయేలా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఇవి మీ షూకి రెయిన్ కోట్ల లాగా పనిచేస్తాయి.


* ఆల్-వెథర్ ఫ్లోర్ మ్యాట్స్:*
వానాకాలంలో కారులోని ఫాబ్రిక్ కార్పెట్ మ్యాట్స్ త్వరగా తడిచిపోయి మురికిగా అవుతాయి.అందువల్ల కారు క్యాబిన్‌లో తేమ ఇంకా దుర్వాసన వస్తుంటుంది. కాబట్టి, మీ కారులోఎప్పుడు కూడా రబ్బరు లేదా ఆల్-వెథర్ మ్యాట్లను వాడాలి. ఇవి నీళ్ల తడిని కారు అడుగు భాగానికి చేరకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా, ఒకవేళ ఇవి మురికిగా మారినా కాని వెంటనే వాటిని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: