రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను రేపు అనగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనుండగా ... ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ రోజు అనగా జనవరి 8 వ తేదీన రాత్రి నుండి ప్రదర్శించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై అనేక మంది అనేక అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు.

ఇకపోతే AI టుల్ అయినటువంటి చాట్ జీపీటీ రాజా సాబ్ మూవీ రిజల్ట్ పై ఎలా స్పందిస్తుంది అనేది తెలుసుకోవడం కోసం కూడా కొంత మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే చాట్ జీపీటీ అనేది ఒక AI టుల్. ఇది సినిమా విడుదలకు ముందు ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది చెప్పడం చేయదు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలను బట్టి , ఈ మూవీ యూనిట్ ఈ సినిమాపై చూపిస్తున్న నమ్మకాన్ని బట్టి. అలాగే ఈ సినిమా సెన్సార్ రిపోర్టును బట్టి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లు చాట్ జీపీటీ తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: