టాలీవుడ్ ,కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీ లీల గురించి చెప్పాల్సిన పని లేదు. అందం అభినయంతోనే కాకుండా తన డాన్స్ తో కూడా అందరిని ఆకట్టుకుంటుంది. జయపజయాలతో సంబంధం లేకుండానే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అయితే శ్రీలీల చేసిన ఒక పని వల్ల అభిమానులు ఆమెను మరింత మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇద్దరు పిల్లలను దత్తకు తీసుకొని మరి పెంచుతోంది. అయితే ఎప్పుడు శ్రీలీల పిల్లల గురించి మాట్లాడలేదు.


శ్రీలీల నటించిన పరాశక్తి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దత్తత తీసుకున్న పిల్లల విషయం గురించి పలు విషయాలను తెలియజేసింది. తాను ఆ పిల్లలను దత్తత తీసుకోవడం వెనక ఒక సినిమా దర్శకుడు కారణమని తెలిపింది. కన్నడ లో ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ తనను ఒక అనాధాశ్రమానికి తీసుకువెళ్లారని, ఆ సమయంలో అక్కడ ఉండే పిల్లలు తనకు చాలా బాగా దగ్గరయ్యారు. అలా సమయం దొరికినప్పుడల్లా వారితో వెళ్లి సరదాగా గడిపేదాన్ని, అందులోనే అక్కడి ఉండే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నానని ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గానే ఉంచాలని చెప్పిన, అనాధ ఆశ్రమం నిర్వాహకులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు చేసిన ఈ మంచి పని చూసి మరో నలుగురు ముందుకి వస్తారని చెప్పడంతో నిజమే అనిపించిందని తెలిపింది.


తాను ఏదో గొప్ప పని చేశానని చెప్పడం లేదు!. కానీ జనాలు కూడా  ఆ వైపుగా ఆలోచిస్తే బాగుంటుందనిపించిందని తెలిపింది శ్రీలీల. ఇక పిల్లల గురించి మాట్లాడుతూ.. వాళ్లు నాతో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నాతో కలిసి ఉండకపోయినా నేను వారిని చాలా బాగా చూసుకుంటాను నా తల్లి నన్ను  ఎలా చూసుకుందో అదే ప్రేమను, అలాగే ఆ పిల్లలకు కూడా చూసుకుంటానని తెలిపింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: