బుల్లితెర ప్రేక్షకులకు నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మౌనరాగం, జానకి కనగనలేదు వంటి సీరియల్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ సంపాదించడంతో బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత వరుసగా సీరియల్లో నటించే అవకాశాలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం వెబ్ సిరీస్ ల పైన ప్రత్యేకించి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రియాంక నటించిన నయనం అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంక జైన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


తాను సీరియల్స్ ని ఎందుకు వదిలేసాను అనే విషయాన్ని చెబుతూ సీరియల్స్ చేస్తే కేవలం ఒక రకమైన పాత్రలోనే చేయాల్సి ఉంటుంది.. ఆ పాత్రలకే తాను బందీగా మారిపోతాననే భయం తనకి మొదలయ్యిందని, అంతేకాకుండా సీరియల్స్ వల్ల డేట్లు అడ్జస్ట్ అవ్వవు ఇతర ప్రాజెక్టులు చేయడానికి కూడా పెద్దగా సమయం ఉండదు కాబట్టి సీరియల్స్ కే పరిమితం అయిపోకూడదని ఆలోచించాను అందుకే తాను సీరియల్స్ లో నటించడానికి దూరంగా ఉన్నానంటూ ప్రియాంక క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయం తెలిసే అభిమానులు నిరాశ చెందుతున్నారు.


కానీ తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం సీరియల్స్ వల్లే అయితే ఆ ప్రయాణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి అని తెలిపింది. వరుణ్ తేజ్ నటించిన నయనం అనే ఒక మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ప్రియాంక జైన్  వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ నటుడు శివకుమార్ తో గత కొన్నేళ్లుగా ఈమె లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ప్రియాంక మరిన్ని విభిన్నమైన పాత్రలలో నటించాలని నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: