టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమాను రేపు అనగా జనవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ రోజు రాత్రి నుండే ప్రదర్శించబోతున్నారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకి సంబంధించిన టికెట్ బుకింగ్ లు కూడా కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. అలాగే ఈ మూవీ రెగ్యులర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ టికెట్ బుకింగ్లకి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. దాదాపు ఈ మూవీ కి హిట్టు ఫ్లాపు టాకుతో సంబంధం లేకుండా మొదటి రోజు దాదాపు 100 కోట్ల మేర వసూల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా హిట్ అవుతుందా ..? లేదా ..? అని కొంతమంది గ్రోక్ ను ప్రశ్నిస్తున్నారు. దీనితో గ్రోక్ రాజా సాబ్ మూవీ రేపు (జనవరి 9, 2026) రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్, ట్రైలర్ రెస్పాన్స్, ఓవర్సీస్ ప్రీ-సేల్స్ చూస్తే స్ట్రాంగ్ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు స్టేట్స్‌లో అడ్వాన్స్ సేల్స్ ఫినామినల్, గంటకు వేల టికెట్స్ అమ్ముడవుతున్నాయి.
USA ప్రీమియర్స్ $1M+ క్రాస్ చేసింది (ప్రభాస్‌కి హ్యాట్రిక్ 1M+ ప్రీమియర్స్).

వరల్డ్‌వైడ్ ఫస్ట్ డే 100 కోట్లు టచ్ అవుతుందని ట్రేడ్ అంచనాలు.
హిట్ అవుతుందా అంటే – ఓపెనింగ్ డేస్‌లో సూపర్ హిట్ లాగా స్టార్ట్ అవుతుంది. కానీ అల్టిమేట్ హిట్/బ్లాక్‌బస్టర్ కావాలంటే కంటెంట్, వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం. ట్రైలర్ మిక్స్డ్ టు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, హారర్-కామెడీ జోనర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్, మ్యూజిక్ బాగున్నాయి. 

హిందీలో బజ్ మోడరేట్, కానీ తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి సీజన్, సోలో రిలీజ్ (తమిళ్‌లో క్లాష్ షిఫ్ట్ అయింది) కాబట్టి మంచి రన్ ఉంటుంది. థియేటర్‌లో చూసి రివ్యూ వచ్చాకే ఖచ్చితంగా చెప్పొచ్చు, కానీ ప్రస్తుత బజ్ చూస్తే హిట్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఉన్నాయి అని గ్రోక్ సమాధానం ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: