తెలుగు ,తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో హీరోయిన్గా స్టార్ డమ్ సంపాదించిన తర్వాత అవకాశాలు తగ్గుతూ ఉండడంతో చాలామంది పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.మరి కొంతమంది ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు స్పెషల్ సాంగ్ లలో కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ తమన్నా ముందు వరుసలో ఉంది. ఈ మధ్య వెబ్ సిరీస్లలో కూడా మరింత బోల్డ్ గా నటిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తమన్నా రెమ్యూనరేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.



ఒక్కో నిమిషానికి కోటి రూపాయలు చొప్పున ఒక్కో పాటకి సుమారుగా 3నుంచి4 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది. స్పెషల్ సాంగ్ లలో తమన్నా సినిమాలు కంటే మించి మరి సంపాదిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తమన్నా గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే న్యూ ఇయర్ సందర్భంగా గోవాలోని ఒక రెస్టారెంట్లో తమన్నా డాన్స్ పెర్ఫార్మషన్స్ ఇచ్చినట్లుగా వీడియోలు వైరల్ గా మారాయి. ఇందుకోసం తమన్నాకు 6 నిమిషాలకు గాను  రూ .6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాలోని కావాలయ్య పాటతో పాటుగా స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కి రాత్ అనే పాటతో భారీ క్రేజ్ సంపాదించుకుంది తమన్నా.


అలా బాలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది. గత ఏడాది ఓదెల 2, రైడ్ 2 వంటి చిత్రాలతో బాగానే ఆకట్టుకున్న తమన్నా ఇప్పుడు ఓ రోమియో, రేంజర్ సినిమాతో పాటుగా మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఏడాది మాత్రం తెలుగులో ఏ ఒక్క సినిమాలో నటించలేదన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని , త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే సందర్భంలో బ్రేకప్  వార్తలు వినిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం పైన తమన్నా కానీ విజయ్ వర్మ కాని క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: