వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  విడదల రజిని ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అక్టోబర్ 15న ఆరోగ్య శ్రీ కి అదనంగా కొన్ని  చికిత్స జత చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  విడదల రజిని తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి  విడదల రజిని అన్నారు. ఆరోగ్యశ్రీని 942 సేవలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ప్రారంభించారన్న మంత్రి  విడదల రజిని. దానిని సీఎం జగన్ 3,254  సేవలకు తీసుకెళ్లారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు 117 సేవలు మాత్రమే ఆరోగ్య శ్రీ లో పెంచారన్న మంత్రి  విడదల రజిని.. 16 వేల కోట్లకు పైగా వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.


ప్రభుత్వం పేదలకు వైద్యం అందించేందుకు వేల కోట్ల రూపాయల ధనం ఖర్చు చేస్తుందన్న మంత్రి విడదల రజిని.. ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకోవటం వారి వ్యక్తిగత విషయమన్నారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు హ్యాండిలింగ్  జరిగిన పొరపాటుపై   ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందన్న రజని.. దీన్ని పెద్దదిగా చేయటం సరికాదన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: