ఒకప్పుడు తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.   ‘బాహుబలి’ సినిమాలో 'శివగామి' పాత్ర .. అప్పటివరకూ రమ్యకృష్ణకి గల క్రేజ్ ను రెండింతలు చేసింది. దాంతో ఇటు తెలుగు నుంచి అటు తమిళం నుంచి కీలకమైన పవర్ ఫుల్ రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.   సాధారణంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వారికి రెమ్యూనరేషన్ కాస్త తక్కువ ఉంటుంది..కానీ రమ్యకృష్ణ విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. 
Image result for rajinikanth ramya krishna
బాహుబలి తెచ్చిన క్రేజ్ తో తన రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచింది.  ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో శైలజ రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణతో కేవలం 25 రోజులు మాత్రమే దర్శకుడు మారుతి చిత్రీకరణ జరుపుతున్నాడు. 25 రోజులకు గాను రోజుకు 6 లక్షల చొప్పున పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏకంగా రమ్యకృష్ణకు కోటిన్నర పారితోషికంను ఇస్తున్నారు.
Image result for rajinikanth ramya krishna
శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో హీరోగా నాగచైతన్య నటిస్తుండగా, హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటిస్తుంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు హీరోయిన్‌ అను ఎమాన్యూల్‌కు 75 లక్షల పారితోషికం ఇస్తున్నారు. అయితే రమ్యకృష్ణకు మాత్రం ఏకంగా డబుల్‌ పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.25 రోజులకు భారీ పారితోషికం అందుకుంటున్న రమ్యకృష్ణ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: