మన వంటింటిన్లోనే ఎన్నో రకాల పిండి పదార్ధాలు మన అందాన్ని పెంచేవి ఉన్నాయ్. శనగపిండి, పెసర పిండి, మైదా పిండి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి. అయితే ముఖానికి పెసరపిండి పట్టిస్తే ఎం అవుతుంది? ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

జిడ్డు చర్మం ఉన్న వారు పావుకప్పు పెసరపిండిలో రెండు చెంచాల పెరుగు, చెంచా కీరదోస రసం, రెండు చుక్కల ఆలివ్‌నూనె కలిపి ఆ పేస్ట్ ని ముఖానికి పూతలా పట్టిస్తే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. 

 

పావుకప్పు పెసరపిండిలో 3 చెంచాల ఆపిల్‌ గుజ్జూ, చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ పేస్ట్ ని ముఖానికి రాసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే నలుపు పోయి ముఖం తాజాగా తయారవుతుంది. 

 

మెడా, మోచేతులు నల్లగా మారినప్పుడు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, గులాబీ నీరు చేర్చి మెత్తగా చేసి నల్లగా ఉన్న చోటా పట్టిస్తే నలుపు పోయి అందంగా మెరిసిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: