A
ప్రస్తుతం చాలా మంది మగవలు తమ ముఖఅందం కోసం పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాలైన క్రీములు వాడుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తుంటారు.కానీ ఎలాంటి ఫలితం ఉండదు.ఇప్పుడు మేము చెప్పబోయే స్టెప్స్ పాటిస్తే సెలూన్ స్టైల్ ఫేషియల్ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

అయితే ఎలాంటి పద్ధతులు వాడితే  ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1.  ముఖం శుభ్రపరచడం:
ముందుగా ముఖాన్ని బాగా శుభ్రపరచుకోవాలి. మంచి నీటితో ముఖం కడుక్కోవడం, తుడవడం లాంటివి మేకప్ అవశేషాలను తొలగించి వేస్తాయి. ముఖం మీద ఉండే దుమ్ము,ధూళి కణాలను శుభ్రపరచుకోవడానికి చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

2.  స్క్రబ్బింగ్ చేయడం:
ఇక రెండవ దశ స్క్రబ్బింగ్ చేయడం. దీనినే ఎక్స్ పోలియట్ అని కూడా అంటారు.  స్క్రబ్బింగ్ చేయడం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.ఇందుకోసం జిడ్డు చర్మం కలవారు కొద్దిగా కాఫీ పొడి, కొద్దిగా చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె లను మిశ్రమంలా చేసి ముఖం మీద మునివేళ్లతో వృత్తాకారంలో మర్దన చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ తో పాటు మలినాలను కూడా శుభ్రం చేయవచ్చు.

3. మర్దన చేయడం:
ముఖాన్ని మసాజ్ చేయకుండా ఫేషియల్ ని పూర్తి చేయలేం. ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉండడంతో పాటు రక్త ప్రసరణను పెంచి, కండరాల  టోన్లను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. మసాజ్ చేయడం అంటే మొదటగా గడ్డం కింది భాగం నుండి మొదలుపెట్టి నుదిటి వరకు వ్యతిరేక దిశలో మసాజ్ చేయడం.

4.  ఆవిరి పట్టడం:
ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించి, అందులో నుండి వస్తున్న ఆవిరిని మన ముఖమంతా పట్టేలా చూడాలి.ఇలా చేయడం వల్ల చర్మం లో నుండి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇంకా ఏమైనా మిగిలి ఉంటే  బయటికి రావడం తోపాటు చర్మం తేలికపడుతుంది.

5.  మాస్క్ వేయడం:
ఈ మాస్క్ వేసుకోవడం వల్ల  మలినాలను బయటకు తీసి,ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.మీకు ఇష్టమైన ఫేస్మాస్క్ వేసుకోవచ్చు. మీ వంటగదిలో దొరికే సహజ పదార్థాలను ఉపయోగించి ఫేస్ మాస్కులు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు: టొమోటోఫేస్ మాస్క్,  అలోవెరా, ఓటు మిల్క్, అరటి, బొప్పాయి లాంటి ఫేస్ మాస్కులు మంచిది.

6.  టోనింగ్ చేయడం:
ముఖంలో టోనింగ్ చాలా ముఖ్యమైనది.టోనింగ్ చేయడం వలన ముఖంపైన రంధ్రాలు మూసుకుపోయి ముఖం నునుపుగా తయారవుతుంది. దీనికి మార్కెట్లో దొరికే టోనర్ లు వాడితే సరిపోతుంది.

7.  మాయిశ్చరైజ్ చేయడం:
మాయిశ్చరైజ్ లో ముఖానికి చాలా అవసరం.ముఖాన్ని శుభ్రపరిచి,ఆవిరి చేసిన తర్వాత చర్మం ఎండిపోతుంది. తద్వారా ముఖానికి తేమ అవసరం.చివరి దశగా చర్మాన్ని  మాయిశ్చరైజ్  చేయడం వల్ల  తగిన తేమను నిలుపుకుంటుంది. చేతులను శుభ్రం చేసుకొని ల్యాక్మే పీచ్ మిల్క్ క్రీములు తీసుకొని చేతివేళ్ళతో ముఖమంతా అప్లై చేయాలి. దీనితో  ముఖానికి కావలసిన తేమ అంది, ముఖం ప్రశాంతంగా తయారవుతుంది.కళ్లకు కూడా తగినన్ని కంటి క్రీమ్ వాడితే చూడచక్కని అందం మీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: