సొగసైన అందం నిగారింపైన కళ్ళు మగువకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి కళ్ళకు ఏవేవో రంగులద్ది పాడు చేస్తుంటారు.వీటికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.కళ్ళు అందంగా కనిపించాలంటే కేవలం కాటుక పెడితే సరిపోదు, లోపల నుంచి పోషనను కూడా అందించాలి. అయితే మన పరిసరాల చుట్టూ ఉండే కాలుష్యం, జీవన విధానం,శ్రమ జీవనం, వాడుతున్న సాంకేతిక పరికరాలు, నిద్రలేమి ఇవన్నీ మన కంటి పైన ప్రభావం చూపిస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా కళ్లను ఆరోగ్యంగా,అందంగా తయారు చేసుకోవచ్చు. ఆ విధి విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా కళ్ళు అందంగా కనిపించాలంటే కంటికి తగ్గ విశ్రాంతి ఎంతో అవసరం పడుతుంది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వాడుకలోకి వచ్చిన తర్వాత నిద్రపోవడం మరిచిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కళ్ళు విశ్రాంతిని కోల్పోతున్నాయి. ఫలితంగా కళ్లు గుంతలు పడిపోవడం, కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతోపాటు ముఖం అందవిహీనంగా తయారవుతుంది. కళ్ళు అందంగా కనిపించాలంటే రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే మంచి నీటితో కడగాలి.
కుదిరితే వారానికి రెండుసార్లు విటమిన్ ఈ తో కళ్ళ క్రింద, కళ్ళ పైన మసాజ్ చేయాలి.ఇలా చేయడం వల్ల కనురెప్పల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగితే కళ్ళు ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఒక చెంచా పసుపు తీసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి కళ్ళ క్రింద, చారల పైన పూతల రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో తుడిచేసుకుంటే సరిపోతుంది. సమయం దొరికినప్పుడు కీరా ముక్కలను కనురెప్పలపై ఉంచితే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.
రోజూ నిద్రపోయే ముందు ముఖం శుభ్రంగా కడుక్కొని రోజ్ వాటర్ తో రబ్ చేయడం మంచిది. రాత్రి పడుకునే ముందు కళ్ళకు కాటుక పెట్టడం వల్ల ఉదయాన్నే కళ్ళల్లో ఉన్న దుమ్ము ధూళి మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కళ్ళు తేటగా తయారవుతాయి. పైన చెప్పిన చిట్కాలను పాటించి మీ అందమైన కళ్ళను మరింత ప్రకాశవంతంగా మెరిసేలా చేసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి