వయసులో వున్నప్పుడు ముఖంపై మొటిమలు మచ్చలు రావడం సర్వసాధారణం. ఆ సమస్య మనల్ని చాలా సంవత్సరాలు వదిలి పెట్టదు. ఎన్నో రకాల క్రీములు వాడతాం. డాక్టర్స్ ని సంప్రదిస్తాం కాని ఎలాంటి ఫలితం ఉండదు. ఇక దానికి ఒకటే మార్గం జామ ఆకుల పేస్ట్. ఇది ముఖంపై వున్న యాక్నే మచ్చలని పోగొడుతుంది. ఇక ఈ సింపుల్ జామ ఆకులని పేస్ట్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఆకుల్ని శుభ్రం చేసుకుని ఆకుల తో పాటు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. దీంతో చక్కగా ఫేస్ గ్లో గా అయి పోతుంది. ఈ పద్ధతి ఎంతో సులువు.జామ ఆకుల పేస్టు కి కావాల్సిన పదార్థాలు..లేత జామ ఆకులు, కొద్దిగా నీళ్ళు.దీన్ని ముఖానికి అప్లై చేసుకోక ముందు మీరు గోరు వెచ్చని నీటి తో ముఖాన్ని కడుక్కోండి. ఇప్పుడు మీ ఫేస్ ని స్టీమ్ చేయండి. దీని వల్ల ఏమవుతుంది అంటే...? రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీని వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఈ స్టెప్ ని మాత్రం స్కిప్ చేయకండి.


ఇప్పుడు మనం నూరుకున్న పేస్ట్ ను తీసుకోండి. దీన్ని శుభ్రంగా ముఖమంతా పట్టే లాగ అప్లై చేయండి.ముఖం అంతా ఫుల్ గా అప్లై చేసుకున్నాక కాసేపు అలా ఉంచేయండి. పూర్తిగా ఆరిపోయాక మీరు చల్ల నీళ్ళ తో ముఖం కడుక్కోండి. కేవలం నీళ్లను మాత్రమే ఉపయోగించండి. ఫేస్ వాష్ ఇప్పుడు ఉపయోగించ వద్దు. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో మంచిగా అవుతుంది.ఖచ్చితంగా మీ ముఖం పై వున్న మచ్చలు మొటిమలు తొలిగిపోతాయి.ఈ పేస్ట్ ని ఎంతో ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. మరియు ఈజీ గా అప్లై చేసుకోవచ్చు.దీనిని వారంలో క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి...ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చెయ్యండి...

మరింత సమాచారం తెలుసుకోండి: