మనం బట్టల షాప్ కు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు బట్టలను చూపించే వ్యక్తి మీ సైజు ఏంటో చెప్పండి సార్ ఆ సైజుకు తగ్గ పట్టాలను చూపిస్తాను అని అంటారు. దానితో మనం ఎప్పుడు వేసుకునే సైజును వారికి చెబుతూ ఉంటాము. ఇక ఆ సైజులో తక్కువ పర్సనాలిటీ కలిగిన వారికి అయితే స్మాల్ అని , కాస్త ఎక్కువ పర్సనాలిటీ కలిగిన వారికి లార్జ్ అని మరి కొంత భారీ పర్సనాలిటీ కలిగిన వారికి ఎక్స్ట్రా లార్జ్ అని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటాం. ఇక S అని షర్టు మీద సైజ్ ఉన్నట్లు అయితే అది స్మాల్ సైజ్ అని అర్థం.
అది చాలా తక్కువ ఎత్తు , బరువు ఉన్న వారికి సెట్ అవుతుంది. ఇక ఆ తర్వాత M అని ఉంటే అది మీడియం అని అర్థం. అది తక్కువ , ఎక్కువ కాకుండా మధ్య బరువు , ఎత్తు ఉన్న వారికి ఉపయోగ పడుతుంది. ఇక L అంటే లార్జ్ అని అర్థం. స్మాల్ , మీడియం , తర్వాత ఇది వస్తుంది. ఇక కొంత మంది కాస్త ఎత్తు ఎక్కువగా ఉండి బరువు కూడా ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు XL బట్టలను వేసుకుంటారు.
XL అంటే ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం. ఇక అంత కంటే ఎక్కువ సైజు ఉన్నవారు XXL బట్టలను కూడా తీసుకుంటూ ఉంటారు. XXL అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా లాడ్జ్ అని అర్థం. ఇలా బట్టల షాప్ లో అనేక రకాల బట్టలు ఉంటాయి. ఇలా మగవారు , ఆడవారికి మాత్రమే కాకుండా చిన్న పిల్లలలో కూడా ఇలాంటి సైజులనే వాడుతూ ఉంటారు. మనిషి బరువు , ఎత్తులను బట్టి ఎక్కువగా ఈ సైజులు ఆధారపడుతూ ఉంటాయి. ఇక మగవారు వేసుకునే షర్ట్ సైజు XL సైజ్ అంటే 42 నుండి 44 అంగుళాల మధ్యలో ఉంటుంది. అదే XXL అంటే 44 నుండి 46 అంగుళాల మధ్య ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: