శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా!? అని ప్రశ్నించారు. జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. శ్రీశైలం జలవిద్యుత్ ప్రమాదంపై నిజానిజాలు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్.