సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన సినిమా అప్‌డేట్‌తో కాదు, తనపై వచ్చిన ఒక అసభ్యకరమైన మరియు అగౌరవకరమైన వ్యాఖ్యపై ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష నిప్పులు చెరిగారు.సినిమా రంగంలో ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్న త్రిష, వివాదాలకు దూరంగా ఉండటమే కాకుండా రాజకీయాల్లో ఎప్పుడూ తటస్థంగానే ఉంటారు. కానీ, కొందరు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. తాజాగా నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు త్రిష సహనానికి పరీక్ష పెట్టాయి.


తమిళ స్టార్ హీరో విజయ్ పెట్టిన టీవీకే (TVK) పార్టీపై విమర్శలు చేసే క్రమంలో నయినార్ నాగేంద్రన్ పరిధులు దాటారు.విజయ్ అనుభవం లేని వ్యక్తని చెబుతూ.. "అతను ముందు బయటకు రావాలి.. త్రిష ఇంటి నుండి బయటకు రావాలి" అంటూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని విమర్శించడానికి త్రిష పేరును అందులోకి లాగడం, ఆమె వ్యక్తిగత జీవితంపై అసభ్యకరమైన రీతిలో మాట్లాడటం అందరినీ విస్తుపరిచింది.తనపై వచ్చిన వ్యాఖ్యలను త్రిష ఏమాత్రం ఉపేక్షించలేదు. వెంటనే తన లీగల్ టీమ్ ద్వారా స్ట్రాంగ్ నోట్ రిలీజ్ చేశారు. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో లీగల్ నోటీసును షేర్ చేస్తూ 'అగౌరవాన్ని ఎప్పుడూ ప్రశ్నించాలి' (Disrespect should and always will be called out) అని గట్టిగా సమాధానం ఇచ్చారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనాగరికమైన వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని ఆమె పేర్కొన్నారు."



త్రిష తన ప్రకటనలో కొన్ని కీలక విషయాలను స్పష్టం చేశారు:

 ఆమె ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం కలిగి లేరని, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు."నేను నా నటన ద్వారా మాత్రమే గుర్తించబడాలని కోరుకుంటున్నాను.. ఇలాంటి పనికిమాలిన పొలిటికల్ కామెంట్స్ ద్వారా కాదు" అని క్లారిటీ ఇచ్చారు.సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బహిరంగ చర్చల్లోకి తీసుకురావడం అనాగరికమని ఆమె హెచ్చరించారు.త్రిష స్పందన తర్వాత సోషల్ మీడియాలో నాగేంద్రన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. డీఎంకే నేత కనిమొళి వంటి వారు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన నయినార్ నాగేంద్రన్, ఫిబ్రవరి 16న తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. "నేను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించాలనుకోలేదు.. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.



వివాదాలు పక్కన పెడితే, త్రిష ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యుత్తమ దశలో ఉన్నారు. చిరంజీవి 'విశ్వంభర', మణిరత్నం 'థగ్ లైఫ్', అజిత్ 'విడాముయర్చి' వంటి భారీ ప్రాజెక్టులతో ఆమె డైరీ ఫుల్ గా ఉంది. ఇలాంటి అటాక్స్ ని ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే ఆమెను ఫ్యాన్స్ 'క్వీన్' అని పిలుచుకుంటారు.మొత్తానికి త్రిష తనకు జరిగిన అవమానాన్ని గట్టిగా నిలదీసి, తన గౌరవాన్ని కాపాడుకున్నారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ, అది ఒక మహిళా నటి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఉండకూడదని ఆమె నిరూపించారు. త్రిష ఇచ్చిన ఈ షాక్ తో రాజకీయ నాయకులు ఇకనైనా తమ మాటలు జాగ్రత్తగా వాడతారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: