రాష్ట్రంలో ని విశాఖ నగరంలో జరుగుతున్న రాజకీయ దాడుల గురించి అందరికి తెలిసిందే.. ప్రతి వారం అక్కడ ఓ సెన్సేషన్ జరుగుతుంది. జగన్ ప్రభుత్వం అవినీతి కోరల్లో ఉన్న నేతలను జైలుకి పంపడం అనే నెపంతో, అక్రమాస్తుల దురాక్రమణ పేరు తో తమకు అడ్డొస్తున్న టీడీపీ నేతల భరతం పడుతుంది. రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు..