తెలుగువారు అత్యధికంగా జరుపుకొని ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి. ఈ పండుగను మూడు రోజుల పాటు చాలా ఆనందంగా, సంబరంగా గ్రాండ్గా చేసుకుంటారు. ఈ పండుగను (భోగి, సంక్రాంతి, కనుమ) పల్లెల్లో మరింత ఆనందంగా జరుపుకుంటారు. పట్టణాలలో పనిచేసే ఉద్యోగులు, చదువుకొని విద్యార్థులు కూడా తమ సొంత ఊరికి వెళ్లి మరి ఈ పండుగను కుటుంబ సభ్యులతో, బంధువులతో జరుపుకుంటారు.
2026 జనవరి నెలలో సంక్రాంతి సెలవులను మొత్తం 9 రోజులపాటు ఇవ్వనున్నారు. దీంతో ఈ సెలవులను పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇలాంటి సెలవులు దొరకడం వల్ల ఏదైనా పర్యటక ప్రాంతానికి, విహారయాత్రకు కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందని, సెలవుల ప్రకటన ముందుగానే అధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. సెలవుల అనంతరం విద్యార్థుల సిలబస్ ప్రకారమే తరగతి గదులు యధావిధిగా కొనసాగుతాయి అంటూ విద్యాశాఖ స్పష్టం చేసింది. అకాడమిక్ క్యాలెండర్ లో ఎలాంటి మార్పులు ఉండవంటూ తెలియజేశారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా సెలవుల షెడ్యూల్ కచ్చితంగా పాటించాల్సిందే అంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. సంక్రాంతి సెలవులు ఖరారు చేయడంతో అటు విద్యార్థిని తల్లిదండ్రులు ఆనంద పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి