ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో ఏ అంశాలు హైలైట్ అయ్యాయి? ఎవరు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించారు? ఏ పార్టీ, ఏ నాయకుడు రాజకీయంగా లాభపడ్డారు? ఏ నాయకుల నిర్ణయాలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి? అనే ప్రశ్నలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలంటే ముందుగా ప్రజల మదిలో గుర్తుకు వచ్చే పార్టీలు ప్రధానంగా రెండే. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్). 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, 2024–2025 కాలం మొత్తం తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపులు తిరిగాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది తనదైన రాజకీయ మార్క్‌ను స్పష్టంగా చూపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి రేవంత్ రెడ్డి కంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ తన నాయకత్వాన్ని చాటుకున్నారు. పాలనలో కఠిన నిర్ణయాలు, పరిపాలనా సంస్కరణలు, అలాగే రాజకీయంగా ప్రత్యర్థులపై తీసుకున్న వైఖరి ఆయనను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిపాయి.ప్రజా సమస్యలపై స్పందన, అధికార యంత్రాంగంపై పట్టును పెంచడం, తన పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వంటి అంశాల్లో రేవంత్ రెడ్డి తనదైన స్టైల్‌ను చూపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కొత్త ఊపొచ్చిందని అనేక మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే… ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో నిజంగా ఎక్కువగా మారుమోగిన పేరు ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి ఎంతగా హైలైట్ అయినా, సోషల్ మీడియా, మీడియా చర్చలు, ప్రజా సంభాషణల్లో ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో అత్యధికంగా వినిపించిన పేరు మాత్రం ఒక్కటే అని చాలామంది అంటున్నారు. అది మరెవరో కాదు… బీఆర్‌ఎస్ నేత, కేసీఆర్ కూతురు – కల్వకుంట్ల కవిత.
ఈ ఏడాది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు తీవ్ర చర్చకు కారణమైంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో వచ్చిన విభేదాలు, తన అన్న కేటీఆర్‌తో ఉన్న అభిప్రాయ భేదాలు, అలాగే తండ్రి కేసీఆర్‌పై చేసిన పరోక్ష మరియు ప్రత్యక్ష వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.కవిత బహిరంగంగా మాట్లాడిన విధానం, తన రాజకీయ ప్రయాణాన్ని ఎలా అడ్డుకుంటున్నారనే అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
“నన్ను రాజకీయంగా ఎదగనివ్వడం లేదు” , “పార్టీలో నాకు న్యాయం జరగడం లేదు”,“కొంతమంది నేతలు కావాలనే నన్ను పక్కన పెడుతున్నారు”..అనే భావన వచ్చేలా ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా హరీష్ రావు గురించి బయటపెట్టిన విషయాలు, అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలున్నాయనే సంకేతాలు ఇచ్చాయి. ఈ వ్యాఖ్యలు కేవలం పార్టీకి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాజకీయాలకు ఒక కొత్త చర్చను తెరలేపాయి.ఇంతవరకు రాజకీయంగా బలమైన కుటుంబంగా గుర్తింపు పొందిన కేసీఆర్ కుటుంబంలో ఈ స్థాయి విభేదాలు బయటకు రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. దీంతో ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, మీడియా అందరూ కవిత వ్యాఖ్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
చాలామంది ప్రజల అభిప్రాయం ప్రకారం,“సీఎం రేవంత్ రెడ్డి అధికార పరంగా హైలైట్ అయితే, ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో అసలు చర్చకు కారణమైన వ్యక్తి మాత్రం కవిత” అని అంటున్నారు. ఆమె మాటలు, ఆమె వైఖరి, ఆమె భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు ఏవిధంగా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి ప్రజల్లో పెరిగిపోయింది.
మొత్తంగా చూస్తే, 2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాలకు ఒక కీలక మలుపు..కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, మరోవైపు బీఆర్‌ఎస్‌లో చోటు చేసుకున్న అంతర్గత పరిణామాలు, ప్రత్యేకంగా కవిత చుట్టూ జరిగిన రాజకీయ చర్చలు ఈ ఏడాది తెలంగాణ రాజకీయాలను హాట్ టాపిక్‌గా మార్చాయి. కొత్త సంవత్సరం 2026లో ఇవన్నీ ఏ దిశగా వెళ్లబోతున్నాయో చూడాలంటే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి