టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి ఆ తర్వాత పలు చిత్రాలలో యాక్టర్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు యాక్టర్ శివాజీ. ఇటీవల దండోర సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో శివాజీ మహిళలు వేసుకొనే బట్టల పైన మాట్లాడిన మాటలు అభ్యంతరంగ ఉన్నాయని చాలామంది ఫైర్ అవుతున్నారు. ఈ విషయం పైన శివాజీ కూడా క్షమాపణలు తెలిపారు. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలకు మాత్రం కొంతమంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా యూజర్స్, నెటిజన్స్ తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. మరి కొంతమంది శివాజీ చెప్పింది సరైనదే ఆయన వాడిన భాష కరెక్ట్ కాదంటూ సపోర్టివ్ గా నిలుస్తున్నారు.


తాజాగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా ఈ ఇష్యూ పైన స్పందిస్తూ.. ఇటీవల ఒక టాక్ షోకి గెస్ట్ గా వచ్చిన ఇంద్రజ ఈ విషయం పైన అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. నువ్వు ఒక డ్రెస్ వేసుకొని పబ్లిక్ లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు నీ డ్రెస్ కరెక్ట్ కానప్పుడు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు , దాని గురించి కామెంట్స్ చేసే హక్కు గానీ, మాట్లాడే హక్కు గానీ వాళ్ళకి ఉంటుంది కదా!.. మనం ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్ తో ఉన్నట్టుగా బయట పబ్లిక్ లో ఉండకూడదు, మాట్లాడకూడదు మనకంటూ ఒక  "డెకోరం "మెయింటెన్ చేయాలి అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో , డ్రెస్సింగ్ విషయంలో కూడా కోడ్ ఉంటుందని తెలిపింది. అలాకాకుండా ఇది నా ఇష్టం.. నువ్వు ఎవరు అడగడానికి అనడానికి  అక్కడ స్పేస్ లేదని ఎందుకంటే మనం పబ్లిక్ లో వచ్చినప్పుడు కొంచెం డీసెంట్ గా ఉండాలని తెలిపింది.


శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్టే అయినా  ఆయన వాడిన భాష చాలా చండాలం. మీ ఇంట్లో మీకు కంఫర్టబుల్గా ఎలాంటి దుస్తులు వేసుకున్న ఎలా ఉన్న అడగరు ,తప్పుపట్టారు. కానీ పబ్లిక్ ఫంక్షన్లకు ,ఈవెంట్లకు వచ్చేటప్పుడు కాస్త నీట్ గా వస్తే మీకే మర్యాద, మన సంస్కృతిని మనమే గౌరవించడం ముఖ్యము వీటివల్ల చాలామంది మారుతారు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: