ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ హీరోలలో నాని ఒకరు. నాని ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలతో వరుస పెట్టి మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే నాని మరో క్రేజీ దర్శకుడి మూవీ లో కూడా నటించడానికి ఓకే చెప్పాడు. నాని తన తదుపరి మూవీ ని సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీ లో నటిస్తూ సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రేట్ సిగ్నల్ ఇచ్చిన నాని మరో దర్శకుడి సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో నానిసినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నాని కి వెంకీ అట్లూరి ఓ కథ ను వినిపించగా ఆ కథ బాగా నచ్చడంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, మరికొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి ఆఖరుగా దర్శకత్వం వహించిన సార్ , లక్కీ భాస్కర్ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఈయన తమిళ నటుడు అయినటువంటి సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాని హీరో గా ఓ మూవీ ని వెంకీ అట్లూరి ఓ మొదలు పెట్టబోతున్నట్లు ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: