అయితే స్వతంత్ర అభ్యర్థులుగా 1505 మంది పంచాయితీలలో గెలిచారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్న పంచాయతీలలో కనీసం సగమైన పంచాయతీలలో కూడా బిజెపి గెలవలేదు. దీంతో క్షేత్రస్థాయిలో బిజెపి పరిస్థితి ఇంత దీనస్థితిలో ఉన్నప్పటికీ 2028 ఎన్నికలలో మాత్రం అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు దశలలో జరిగిన ఎక్కడా కూడా బిజెపి మద్దతుదారులు చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను అందుకోలేదు.
2020లో జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలలో 150 డివిజన్లో బిజెపి ఏకంగా 48 డివిజన్లు గెలిచి ఒక చరిత్ర సృష్టించింది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా 8 నియోజకవర్గాలలో గెలిచింది బిజెపి. 2024 ఎన్నికలలో కూడా 8 నియోజకవర్గాలలో ఎంపీ స్థానాలను గెలిచింది. అటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో సాధించిన ఫలితాల వల్ల బిజెపికి తెలంగాణలో కూడా మంచి ఊపు వచ్చింది. ఆ తర్వాత జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా రెండు చోట్ల గెలవడంతో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన విజయం తమదే అన్నట్టుగా బిజెపి నేతలు రెచ్చిపోయారు. కానీ ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలలో చూస్తే మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. మరి 2028 ఎన్నికల నాటికి మరింత బిజెపి పార్టీ బలపరచుకొని ముందుకు వెళుతుందేమో చూడాలి. బిజెపి పార్టీకి గ్రామ స్థాయిలలో పెద్దగా పట్టు లేదని విధంగా తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి