ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాలు వసూళ్ల పరంగా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా 'ఛాంపియన్', 'శంబాల', 'ఈషా' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ మంచి కలెక్షన్లను సాధించడం విశేషం.
'ఛాంపియన్' సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే 4.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి పటిష్టమైన స్థితిలో కొనసాగుతోంది. అలాగే, విభిన్నమైన కథాంశంతో వచ్చిన 'శంబాల' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రం 3.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని లాభాల బాటలో పయనిస్తోంది. వీటితో పాటు విడుదలైన 'ఈషా' సినిమా కూడా తొలి రోజే సంచలనం సృష్టించింది. సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజున 2.18 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సత్తా చాటింది.
ఈ మూడు సినిమాలు అటు బుకింగ్స్ విషయంలోనూ, ఇటు వసూళ్ల విషయంలోనూ జోరు చూపిస్తూ థియేటర్లకు కళ తీసుకువచ్చాయి. సాధారణంగా పెద్ద సినిమాల హడావిడి ఉండే పండుగ సీజన్‌లో, ఈసారి చిన్న సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడం గమనార్హం. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రాల విజయాలు మరోసారి నిరూపించాయి. మొత్తానికి 2025 సంవత్సరానికి ఈ చిన్న సినిమాలు ఘనమైన ముగింపును ఇస్తూ సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దండోరా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి