తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన కేసీఆర్ ప్రస్తుతం కష్టాల కడలిలో ఉన్నారు.. గత రెండు పర్యాయాలు ఎదురులేని మనిషిగా ఉన్న ఈయన ప్రస్తుతం బెదిరిపోతున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈయన  కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అలాంటి కేసీఆర్ ను కారు పార్టీని కొత్త ఏడాదిలో కష్టాలు చుట్టుముట్టబోతున్నాయి.. కారు టైరును పంచర్ చేయబోతున్నాయి.. మరి అది ఎలా జరుగుతుంది అనే వివరాలు చూద్దాం.. కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ మూడు కేసులు పార్టీని ఉక్కిరి  బిక్కిరి చేయబోతున్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండవది ఫార్ములా ఈ రేస్, మూడవది కాళేశ్వరం అవినీతి.. ఈ విధంగా మూడు కేసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇందులో ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను కూడా విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఈ కేసుల్లో ఏ2 గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను కూడా విచారణ చేసేందుకు కేంద్ర హోం శాఖ నుంచి అనుమతులు కూడా కోరినట్టు తెలుస్తోంది.

అయితే కొత్త ఏడాదిలో అనుమతులు వస్తే ఆయనను కూడా సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏడాది లో పలు కేసులతో ఉక్కిరి బిక్కిరి కాబోతోంది.. ఇప్పటివరకు చాలా సంయమనం పాటించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  కొత్త ఏడాదిలోనే ఈ కేసులను బయటకు తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటనేది చాలా ఆసక్తికరంగా మారింది.. ఏది ఏమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరియు మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ లపై విచారణ చేస్తే తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా మారుతాయి అనేది ముందు ముందు తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: