తమిళ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. లోకేష్ కనకరాజన్ దర్శకుడు.కార్తి ఖైదితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.. లాక్ డౌన్ ముందుగానే ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంది కరోనా... దాంతో విజయ్ ఫాన్స్ నిరుత్సాహపడ్డాడు.. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేస్తారని చూసిన ధియేటర్ రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపారు.