అందరు ఆశ్చర్యపోయేవిధంగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా అనౌన్ చేశాడు.. మొన్నటిదాకా కొంతమంది పేర్లు వినిపించిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.. ఫస్ట్ లుక్ కూడా వారి ఇమేజ్ కి తగ్గట్లే ఉంది..కేజీఎఫ్ సినిమా ను నిర్మించిన సంస్థ హోమ్ బేల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బాహుబలి తో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్, నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ల కాంబో లో సినిమా అంటే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.. బాహుబలి హీరో, కేజీఎఫ్ దర్శకుడు ఇది చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి.