కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందో... దానిని అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు 326 మంది కోవిడ్ 19 వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశంలో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 4, 421 కి పెరగగా... గత 24 గంటల్లో 354 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణయ్యిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రోగులను ప్రత్యేక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. 

 


ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడకుండా ఉండేలా చూసుకుని కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం ఓ కొత్త వ్యూహాన్ని పాటిస్తుందని ఆయన అన్నారు. ఈ కొత్త వ్యూహం వలన ముంబై, మహారాష్ట్ర, ఆగ్రా గౌతమ్, బుద్ధ నగర్, బిల్వారా, ఈస్ట్ ఢిల్లీ నగరాలలో సానుకూల ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. కరోనా సమన్వయానికి ఓ విధానం తీసుకొచ్చామని, టెక్నాలజీ సహాయంతో క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్క కరోనా రోగిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. భారత రైల్వే శాఖ 2, 500 కోచ్‌లలో 40 వేల ఐసోలేషన్ పడకలు సిద్ధం చేసిందని... ప్రతిరోజు దేశవ్యాప్తంగా 133 ప్రాంతాలలో 375 ఐసోలేషన్ పడకలను రైల్వే శాఖ సిద్ధం చేస్తోందని లవ్ అగర్వాల్ తెలియజేశారు. 

 


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం... ఎవరైనా కోవిడ్19 వ్యాధిగ్రస్తుడు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల్లో తిరిగితే... అతను 30 రోజుల్లో 406 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చేయగలరని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉన్నతాధికారి ఆర్. గంగఖేద్కర్ మాట్లాడుతూ... ఇప్పటివరకు 1,07,006 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని... ప్రస్తుతం 136 ప్రభుత్వాల లాబరేటరీలు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయని... 56 ప్రవేటు లాబరేటరీలకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: