ఏపీలోని విశాఖలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటనపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన బాధితులకు త్వరగా కోలుకునేలా సహాయసహకారాలు అందిస్తామని పేర్కొంది. కేంద్రం ఇప్పటికే బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చేయాలని అధికారులను ఆదేశించింది. పూణే నుంచి విశాఖకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని కేంద్రం ప్రకటన చేసింది. 
 
250 కుటుంబాలను ఇప్పటికే తరలించామని... రెండు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించామని పేర్కొంది. కేంద్రం బాధితులు త్వరగా కోలుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే గ్యాస్ లీకేజ్ జరిగిందని సమాచారం. సాధారణంగా లీకైన కెమికల్ ఎప్పుడూ 20 డిగ్రీల ఉష్ణోగ్రత లోపే ఉండాలి. కానీ సంస్థలో తలెత్తిన లోపాల వల్ల గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుందని సమాచారం. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ బాధితులకు మెరుగైన చికిత్స అందేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: