ఉపాధి హామీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 13.62 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మహాత్మగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజు కూలీని 20 రూపాయలు పెంచనున్నట్లు కేంద్రం పేర్కొంది. లాక్ డౌన్ అమలు వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. 
 
లాక్ డౌన్ కాలంలో నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం గతంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన కింద 34,800 కోట్ల రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమైంది. కేంద్రం ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ వంద రోజుల పని కల్పించాలని ఆదేశించింది. రోజుకు 20 రూపాయలు వేతనం పెంచడంతో ఉపాధి హామీ కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం నుంచి రోజు కూలీని పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: