ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరెంట్ బిల్లుల గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. వివిధ కారణాల వల్ల గతంతో పోలిస్తే కరెంట్ బిల్లులు ఎక్కువ రావడంపై ప్రతిపక్షాలు వైసీపీపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ఇళ్లలోనే ఉంటూ టీడీపీ నాయకులు దీక్షలు చేయాలని ఆదేశించారు. 
 
జగన్ సర్కార్ నాలుగు రెట్లు ఛార్జీలు పెంచిందని... ప్రజలు కరోనా విజృంభణతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కరెంట్ బిల్లులు పెంచడం సరి కాదని అన్నారు. దేశంలోని డిస్కంలకు కేంద్రం రూ.90 వేల కోట్లు రాయితీలు ఇచ్చిన తరుణంలో జగన్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ధరలు పెంచడం దుర్మార్గం అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని... అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: