ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం చివరకు కేంద్రానికి చేరింది. అపెక్స్ కౌన్సిల్ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై సమావేశం నిర్వహించనుంది. కింద్ర జల వనరుల శాఖ నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. కేంద్ర జలవనరుల శాఖ ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు కృష్ణా, గోదావరీ యాజమాన్య బోర్డులకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది. 
 
కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ జీవో 203 విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో సమస్య పరిష్కారం కొరకు కేంద్ర జనవరుల శాఖ రంగంలోకి దిగింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: