అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) సమ్మిట్‌కు హాజరు కావాలంటూ చేసిన ఆహ్వానాన్ని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిరాకరించారు. అక్కడి అధికార వర్గాలు నిన్న ఈ విషయాన్ని వెల్లడించాయి. ట్రంప్ ఆహ్వానానికి కృతజ్ఞతలు చెప్పిన మెర్కెల్ కరోనా కష్ట కాలంలో తాను రాలేనని తెలిపారు. ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సిన జీ 7 శిఖరాగ్ర సమావేశం కరోనా ఎఫెక్టుతో జూన్ కు వాయిదా పడింది. తాజాగా ఈ సమావేశం మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది. 
 
జీ 7 సదస్సును నేరుగా నిర్వహిస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటన చేశారు. సభ్యులందరి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడంతో కరోనా వైరస్ సాధారణ స్థాయికి వచ్చిందనే గొప్ప సంకేతం ప్రపంచానికి ఇవ్వవచ్చని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఏంజెలా మెర్కెల్ హాజరు కానని చెప్పడంతో ట్రంప్ ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు రష్యా తిరిగి ఈ బృందంలో చేరాలని కోరుకుంటోందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: