దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. దేశంలో కరోనాతో బాధ పడుతున్న వారి సంఖ్యను కోలుకున్న వారి సంఖ్య తొలిసారి అధిగమించింది. కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉండగా రికవరీ కేసుల సంఖ్య 1,35,206గా ఉంది. 
 
అమెరికా, బ్రెజిల్ తో పోలిస్తే భారత్ లో రికవరీ శాతం ఎక్కువగా ఉంది. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో ఈ దశకు చేరుకున్న తరువాత క్రమంగా వైరస్ విజృంభణ తగ్గింది. వైద్య నిపుణులు భారత్ లో కూడా క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 9,985 మందికి కరోనా నిర్ధారణ కాగా 274 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: