తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా  వైరస్ కేసుల సంఖ్య లాక్ డౌన్ సడలింపు తర్వాత భారీ మొత్తంలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తక్కువ రోజుల్లోనే భారీ మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపు రెండు వందలకు పైగా కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయి. 

 


 అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కి సంబంధించి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా  వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఐసీఎంఆర్ కి ఇచ్చిన అన్ని గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తు.చ తప్పకుండా పాటిస్తూ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు అనే  విషయాన్ని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది అంటూ గుర్తు చేశారు ఈటెల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి: