ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. వైరస్ పేరు చెబితే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క‌రోనా రోగులున్న హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర్లో కానీ, పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తుల ద‌రిదాపుల్లోకి వెళ్లాల‌న్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఓ దొంగ మాత్రం ఐసోలేషన్ వార్డులోకి వెళ్లి కరోనా సోకిన వ్యక్తి ఫోన్ దొంగతనం చేశాడు. 

 

అసోంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడుని 22 ఏళ్ల బ‌ర్మ‌న్‌గా గుర్తించిన పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకొని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. సూపరింటెండెంట్ మనోజ్ దాస్ ఐసోలేషన్ వార్డ్ లోకి వెళ్లడానికి దొంగ ధైర్యం చేస్తాడని తాను అనుకోలేదని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చేతిలో డబ్బులు చాలకపోవడంతో ద‌ర్జాగా వెళ్లి ఐసోలేషన్ వార్డులో స్మార్ట్ ఫోన్ ను దొంగలించాడు. స్మార్ట్ ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: