కరోనా విజృంభణ వల్ల ఏపీలో ఆదాయం తగ్గినప్పటికీ సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్రంలో ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకం నేటి నుండి అమలు కానుంది. . నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు సీఎం జగన్ ఏడాదికి 15వేల రూపాయల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇవ్వనున్నారు. 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 
 
గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేసింది. తుది జాబితాలను శాశ్వత ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచింది. ఈ పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 76,361 మంది మహిళలు లబ్ధి పొందగా విజయనగరంలో అత్యల్పంగా 3,726 మంది లబ్ధి పొందనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: