ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మునిసిపల్, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 71 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు జరుగుతోన్న పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఉదయం 9 గంటల వరకు ఉన్న అప్‌డేట్‌ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా 13.23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: