ఎల్లో మీడియాలో త‌మ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ‌స్తోన్న వార్త‌ల‌పై విజ‌య‌మ్మ ప్ర‌జ‌ల‌కు ఓ లేఖ రూపంలో స‌మాధానాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల‌, జ‌గ‌న్ మ‌ధ్య విబేధాల‌తో పాటు ష‌ర్మిల కొత్త పార్టీపై కూడా విజ‌య‌మ్మ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, తనకు పొరుగున ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, అక్కడి ప్రభుత్వంతోనైనా తన రాష్ట్ర శ్రేయ‌స్సు కోసం సత్సంబంధాలు పెట్టుకుంటున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే వైసీపీని తెలంగాణ‌లో న‌డిపించ‌డం కుద‌ర‌ద‌ని చెప్పారు. అందువ‌ల్లే ష‌ర్మిల తెలంగాణ కోడ‌లిగా ఇక్క‌డ ప్ర‌జాసేవ‌లో ఉండాల‌న్న నిర్ణ‌యం తీసుకుంద‌ని విజ‌య‌మ్మ చెప్పారు. ఎవ‌రి అభిప్రాయాలు వారివే త‌ప్పా ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు లేవ‌ని ఆమె చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: