కరోనా కేసుల విజృంభణ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాక్సిన్ వేస్తున్న ప్రయోజనం తక్కువగానే కనిపిస్తుంది.. మరో వైపు కరోనా సోకినా వారికి కావాల్సిన ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో లేకపోవడం తో మరింత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ క్రమం లో రియల్ స్టార్ సోను సూద్ ఆసుపత్రి వర్గాలను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. " అందరికి తెలుసు ఆ ఇంజెక్షన్ అందుబాటులో లేదని, అయినా కూడా డాక్టర్స్ అదే ఎందుకు రెఫర్ చేస్తున్నారు. మీ ఆసుపత్రిలో దొరకనిది సామాన్యుడికి ఎలా దొరుకుతుంది. ఇంకా ప్రాణాలు పోకముందే సబ్సిట్యూట్ తయారు చేసుకోవాలి " ఈ ప్రశ్నతో చాల మంది ఏకీభవిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: