అమరావతి భూముల కొనుగోలు కేసుకి సంబంధించి సుప్రీం కోర్ట్ లో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ని ఉపసంహరించుకుంది. దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం లో దాఖలు చేసిన పిటీషన్ ఉపసంహరించుకుంది. హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులపై గతంలో సుప్రీం ని ఆశ్రయించిన ఏపీ సర్కార్... పిటీషన్ ఉపసంహరించుకుంటున్నట్టు  తెలిపింది.


హైకోర్ట్ లోనే కౌంటర్ దాఖలకు అనుగుణం గా పిటీషన్ ను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. ఏడు నెలలు అయినా ఇంకా పిటీషన్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించిన ధర్మాసనంకు ఏపీ లాయర్ షాకింగ్ సమాధానం చెప్పారు. ఇప్పుడే తమకు తెలివి వచ్చింది అంటూ లాయర్ సమాధానం ఇవ్వడం గమనార్హం. అమరావతి భూముల కేసులో గతంలో విచారణపై స్టే హైకోర్ట్ స్టే ఇచ్చిన సంగతి విదితమే. మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్ట్ కి ఏపీ సర్కార్ వెళ్ళగా 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్ట్ కు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: