కరోనా వ్యాక్సీన్ రూపొందించడంలో క్లినికల్స్ ట్రయల్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ ట్రయల్స్ ద్వారానే వ్యాక్సీన్ల సమర్థతను అంచనా వేస్తారు. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు వాలంటీర్ల సహకారం అవసరం. అయితే ఇలా క్లీనికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారికి ఇకపై ప్రత్యేకంగా సర్టిఫికెట్లు అందజేస్తామని కేంద్రం ప్రకటించింది.

ఇకపై ఏ వ్యాక్సీన్ తయారీలో భాగంగా ట్రయల్స్‌లో పాల్గొన్నా వారికి కొవిన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వాలంటీర్లు మరింత ఉత్సాహంతో ముందుకు వస్తారని కేంద్రం భావిస్తోంది. అనేక సార్లు క్లినికల్ ట్రయల్స్‌కు తగినంత మంది వాలంటీర్లు లేక జాప్యం జరుగుతోంది.ఈ జాప్యం నివారించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇండియాలో క్లినికల్స్ ట్రయల్స్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని వ్యా‌క్సీన్ తయారీ సంస్థలు ఆశిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: