అనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎం పదవి నుండి ఎడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. యడ్యూరప్పకు సీఎం కుర్చీ నుండి దిగడం ఇష్టం లేకపోయినా బలవంతంగా దించేశారు. అయితే తాజాగా కర్ణాటక సీఎం గా బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకరం చేశారు. కర్ణాటక 20 వ సీఎంగా బసవరాజు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఆర్.బొమ్మై కుమారుడే బసవరాజు బొమ్మై. ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్నారు.

హుబ్లీ లో 1960 జనవరి 28న జన్మించారు. బసవరాజు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయన గతంలో లో యడ్యూరప్ప మంత్రి వర్గంలో లో పని చేశారు. అంతేకాకుండా బసవరాజు బొమ్మై యడ్యూరప్ప కు ప్రియ శిష్యుడు అని అంటారు. అంతే కాకుండా బసవరాజు కు సీఎం పదవి అప్పగించడంపై యడ్యూరప్ప కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బసవరాజు ప్రస్తుతం క్రికెట్ మరియు వాలీబాల్ చైర్మన్ కూడా ఉన్నారు. గతంలో బసవరాజు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: