రేపు వైఎస్సార్ 12 వ వర్ధంతి నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. లోటస్ పాండ్ నుంచి ఇడుపుల పాయ కి బయలు దేరిన వైఎస్ షర్మిల... రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ కి విజయమ్మ తో కలిసి నివాళి అర్పిస్తారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రేపు పార్టీ కార్యాలయం లో భారీ ఎత్తున జాబ్ మేళాతో పాటుగా రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తారు.

సాయంత్రం వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న సంస్మరణ సభ కు షర్మిల హాజరు అయ్యే అవకాశం ఉంది. అది అలా ఉంటే తాడేపల్లి తమ నివాసం నుండి రోడ్డు మార్గాన నేరుగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప బయల్దేరి వెళ్ళారు. ఈ నేపధ్యంలో వీరు ఇద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: