దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు రోజు రోజుకు భ‌గ్గుమంటున్నాయి. ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పాటు మిగ‌తా జిల్లా కేంద్రాల్లో అదే ప‌రిస్థితి. తెలుగు రాష్ట్రాల‌లోని పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అదేవిధంగా ఉన్నాయి. పెట్రోల్ పై 32 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లు పెంచారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో సైతం డీజిల్ ధ‌ర నేడు సెంచ‌రీ దాటింది. మిగ‌తా ప్రాంతాల్లో ముందే సెంచ‌రీ దాటింది. ఇదిలా ఉండగా నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ ప్రాంతాలు త‌ప్ప మిగ‌తా ప్రాంతాలన్నింటిలో సెంచ‌రీ దాటింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర‌ల మార్పుల‌తో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూ, త‌గ్గుతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 107.40, డీజిల్ 100.13 ఉన్న‌ది. క‌రీంన‌గ‌ర్‌లో రూ.107.27, డీజిల్ రూ.100.01, ఖ‌మ్మంలో 107.48, డీజిల్ రూ.100.19గా ఉంది. మెద‌క్‌లో రూ.107.50 పెట్రోల్‌, డీజిల్ 100.23గా ధ‌ర ఉంది. రంగారెడ్డిలో రూ.107.41 పెట్రోలు, డీజిల్ రూ.100.14, ఇక వ‌రంగ‌ల్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 106.91ఉండ‌గా, డీజిల్ 99.67గా ఉంది. మ‌రో వైపు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.24 కు ల‌భిస్తుంది. ఈ ధ‌ర‌లు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు బెంబెలెత్తుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: