రెవెన్యూ శాఖ‌కు చెందిన ప‌లువురు త‌హ‌సీల్దార్లు, ఇత‌ర అధికారులు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు విజిలెన్స్ విభాగం ప్ర‌భుత్వానికి నివేదించింది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదిముబార‌క్ ప‌థ‌కాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్ర‌మంగా డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు నివేదించింది. వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన వారి జాబితాలో త‌హ‌సీల్దార్లు, డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్లు, వీఆర్ఏలు త‌దిత‌రులున్న‌ట్టు వివ‌రించింది.

క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదిముబార‌క్ ప‌థ‌కాల్లో ఒక్కో ద‌ర‌ఖాస్తుదారుడి నుంచి కనిష్టంగా వెయ్యి నుంచి ప‌దివేల వ‌ర‌కు అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు విజిలెన్స్ విభాగం నివేదించింది. వాస్త‌వానికి ఈ నివేదిక జూన్ 19 న వ‌చ్చింది. కానీ క‌లెక్ట‌రేట్‌ల‌లో ర‌హ‌స్యంగా ఉంచిన‌ట్టు స‌మాచారం. మొత్తం 43 మందిపై  చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజిలెన్స్ విభాగం ప్ర‌భుత్వానికి సిపార‌సు చేసింది. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకొని నివేదించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: